The Naming Ceremony Of Lord Krishna In Telugu – శ్రీ కృష్ణుని నామకరణం

శ్రీ కృష్ణుని నామకరణం:

Naming Ceremony Of Lord Krishna

Naming Ceremony Of Lord Krishna

గోకులంలో చిన్న శిశువును యశోదాదేవి ఆమె భర్త నందుడు అల్లారుముద్దుగా పెంచుకొంటున్నారు. వాళ్లకు యోగమాయ జననంగాని, వసుదేవుడు చేసిన శిశువులు మార్పిడిగాని తెలియదు. శిశువుకు స్వస్తి పుణ్యాహవాచనాలు జాతకర్మ చేయించి నందుడు బారసాల మహోత్సవం జరిపాడు. పెద్దలు శ్రీ కృష్ణుడని శిశువుకు నామకరణం చేశారు. వ్రేపల్లెవాడ వేడుకలతో సంబరాలతో వెల్లివిరిసింది. కంచుకాలు తల పాదాలు కాంచన భూషాంబరాలు ధరించి గోపకులు గుమిగూడారు. “మన యశోద చిన్ని మగవాని గనెనట” చూసి వస్తామని గోపికలు వచ్చారు. దుందుభులు మ్రోగాయ. గాయక సందోహం పాటలు పాడారు. భద్రకాహళ తూర్యరవాలు దశ దిశలు మర్మ్రోగాయి. ముత్తైదువులు అందరూ అక్కడ చేరి పాటలు పాడారు.

జో జో కమలదళ్లేక్షణ

జో జో మృగరాజమధ్య జో జో కృష్ణా !

జో జో పల్లవకరవద

జో జో పూర్ణేందువదన జో జో యనుచున్.

వారు బాలకృష్ణునికి పవళింపుసేవ చేశారు. శ్రీ కృష్ణుడు వ్రేపల్లెలో అల్లారుముద్దుగా ఆడుకుంటూ పాడుకుంటూ పెరగసాగాడు.

పాలతో ప్రాణాలను తీయాలనుకున్న పుతన సంహారం గురించి తరువాయి భాగంలో చెప్పుకుందాం…..

Krishna Story part – 1

 

 

Leave a Reply