Lord Krishna Stories In Telugu – Nalakuvara And Manigriva – శ్రీకృష్ణుని అల్లరి చేష్టలు

అల్లరి కృష్ణుని చిలిపి చేష్టలు:

శ్రీ కృష్ణుడు చిన్నతనంలో చేసిన అల్లరి ఇంతింతని వర్ణించనలవి కానిది. శ్రీ కృష్ణుడు నవనీతచోరుడుగా జగత్ప్రసిద్ధుడు. పాలు – వెన్న- మీగడలు ఉమ్మడిసొత్తుగా అనుభవించటానికి తోడి గోపబాలకుల ప్రోత్సహించి వ్రేపల్లెలోని గోపికలందరినీ ఒక ఆట ఆడించాడు. వ్రేపల్లెలోని గొల్లెతలు యశోదతో శ్రీ కృష్ణుని అల్లరి చేష్టలు అభివర్ణించి చెప్పుకున్నారు . అంతేగాదు శ్రీ కృష్ణుడు వెన్న- పెరుగు త్రాగి వెళ్లిపోయే ముందు ఇంట్లో మైమరచి నిద్రిస్తున్న కోడలిమూతికి కొంత రాసి తప్పుకున్నాడని పిమ్మట అత్తగారు ఆ కోడలిని దొంగతింది తిన్నట్లు శంకించి శిక్షించిందనీ ఇట్లే బాలకృష్ణుని ఆగడాలు అన్నీ యశోదమ్మకు గోపికలందరు కలిసి చెప్పారు.

కలయో! వైష్ణవమాయయో!:

ఒకనాడు బలరాముడే వచ్చి యశోదతో బాలకృష్ణుడు మన్ను తిన్నాడని చెప్పాడు. తల్లి యశోద బాలకృష్ణుని మందలించింది. చిన్నకృష్ణుడు తాను మన్ను తినలేదని వాదించాడు. అంతేకాక తన మాటలు నిజమో కాదో తానే తేల్చుకోమని శ్రీ కృష్ణుడు తన నోరు తెరచి తల్లికి చూపించాడు. కాని యశోదకు కనుపించిన దృశ్యం వేరు. శ్రీ కృష్ణుని నోట్లో యశోదకు విశ్వమంతా కనపడింది. ఆమె ఆశ్చర్యంతో ఇలా అనుకొనింది.

కలయో! వైష్ణవ మాయయో! ఇతర సంకల్పార్థమో! సత్యమో!

తలపన్ నేరక యున్నదాననో! యశోదాదేవిగానో! పర

స్థలమో! బాలకుండెంత! యీతని ముఖస్థంబై అజాండంబు ప్ర

జ్వలమైయుండుట కేమి హేతువో! మహాశ్చర్యంబు చింతింపగన్.

మద్దిచెట్లలోంచి మహనీయుడు:

ఒకనాడు అల్లరిచేస్తున్న శ్రీకృష్ణుని తల్లి యశోద రొలికి కట్టేసింది. అతడు తల్లికన్నుగప్పి ఆ రోలీడ్చుకొని రెండు మద్దిచెట్ల మధ్యకు పోయాడు. ఆ రోలు రెండు చెట్లమధ్య చిక్కుకుంది. బాలకృష్ణుడు ముందుకు సాగిపోయాడు. ఆ రెండు చెట్లు ఫెళ్ళఫెళ్ళమంటు నేలపై కూలాయి. అవి వట్టి చెట్లు కావు. నారదముని శాపంచేత కుబేరపుత్రులు నలకూబర మణీగ్రీవులు చెట్ల రూపంలో బాలకృష్ణుని బలస్పర్శచేత శాప విమోచనం పొందారు.

వత్సాసుర – బకాసురసంహారం మరియు కాళీయమర్దనం గురించి తరువాయి భాగంలో చెప్పుకుందాం…..

Krishna Story part – 1

Leave a Reply