Lord Krishna Stories In Telugu – Kaliya Story In Telugu – kaliya Mardanam

వత్సాసుర – బకాసుర సంహారం మరియు కాళీయమర్దనం:

వత్సాసుర – బకాసుర సంహారం :

బృందావనానికి గోపకులు తమ నివాసం మార్చారు. అక్కడ గూడ శ్రీకృష్ణుడు ఎన్నో అత్భుతలీలలు ప్రదర్శించాడు. అందులో వత్సాసుర – బకాసుర వధలు పేర్కొనదగినవి. రాక్షసులు కామరూపులై శ్రీ కృష్ణుని సంహరించటానికి వత్స రూపంలో బలరూపంలో రావటం శ్రీ కృష్ణుడు వారిని గుర్తించి సంహరించటం గోపబాలకులు ఆశ్చర్యచకితులు కావటం ఇదీ కథ. యోగీశ్వరులకు దుష్కరతపశ్చర్యతో గూడ సాక్షాత్కరించని ఆ పరమాత్మ శ్రీ కృష్ణుడుగా అవతరించి లీలామానుష రూపధారియై గోపాలబాలురతో చల్దులారగించటం, చనువుగా తిరగటం ఆహా! వారిది ఎంతటి అదృష్టం!

కాళీయమర్దనం :

కాళియ అనేవాడు ఒక నాగుపాము, అతను యమునానదిలో తన నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ కాళియుడు చిందించే విషంవల్ల యమునా నది జలం మొత్తం కలుషితం అయింది. అంతేకాగ…..అతని విషపు వేడికి నది నీలుకూడా మరుగుతూ, నదిపై ఎగిరే పక్షులకు హాని చేయసాగింది. ఆ నీటి వేడి సేగలకు తట్టుకోలేక పక్షులు, నదిలో జీవించే జీవులు చనిపోసాగాయి. ఇది చూసిన శ్రీ కృష్ణుని మనసు చెలించిపోయింది. ఎంతైనా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ దైవ లక్షణం కదా! శ్రీకృష్ణుడు తక్షణమే యమునానది  జలాలను కాలుష్యం నుండి కాపాడాలని మరియు కాళీయుసర్పం కోరల్లోంచి వెలువడుతోన్న విషం నుండి పశుపక్ష్యాదులను కాపాడాలని అనుకున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు యమునా నదిలోకి దూకాడు.

శ్రీకృష్ణుని చుసిన కాళియుడు తనకు అపకారం చేయవచిన్న బాలుడికి తక్షణం బుద్ధి చెప్పాలనుకున్నాడు, తన పొడవాటి శరీరంతో శ్రీ కృష్ణుని చుట్టేసి కృష్ణుడికి ఊపిరి ఆడనీయకుండా చేయలనుకున్నాడు. కాని ఆ బాలుడి రూపంలో ఉన్నదీ సాక్షాతూ మహావిష్ణువని గమనించలేకపోయాడు. ఒడ్డున ఉన్నగోప బాలికలు, యశోదా దేవి, నందుడు అందరూ కంగారుపడసాగారు, భయాందోళనలకు లోనయ్యారు. దాంతో శ్రీ కృష్ణుడు నవ్వుతూ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.

శ్రీకృష్ణుని ఆకృతి పెరగడంతో కాళీయ సర్పం పట్టు విడిపోయింది, కోపంతో కాళియుడు బుసలు కొట్టసాగాడు. ఇక శ్రీ కృష్ణుడు కాళీయుని నూరు పడగలపై అందంగా నృత్యం చేస్తూ ఆ సర్పం లోని విషాన్ని బయటకితిసాగాడు. శ్రీకృష్ణుడు కాళియుడి ఒక్కో పడగమీద నుంచి మరో పడగపైకి దూకుతూ నృత్యం చేసాడు. ఇలా శ్రీ కృష్ణుడు కాళియ మర్దనం చేస్తోంటే కాళీయుడు తగ్గిపోయాడు అతని పడగలు దెబ్బతిన్నాయి, రక్తం ధారలు కారటం మొదలైంది. దీంతో కాళీయుడికి బుధి వచ్చి పశ్చాత్తాపానికి లోనయ్యాడు. శ్రీకృష్ణుని శరణు వేడుకున్నాడు. కాళీయుని భార్యలు కూడా శ్రీ కృష్ణుని పాదాలపై పడి, కాళీయుని క్షమించమని ప్రార్ధించారు. అప్పుడు శ్రీ కృష్ణుడు వారిపై దయ తలచాడు.. కాళీయుని వెంటనే యమునానదిని వదిలి వెళ్ళిపొమ్మని అజ్ఞాపించాడు, కాళియుడిని రమణక ద్వీపానికి వెళ్లి అక్కడ జీవించమని ఆజ్ఞాపించాడు. శ్రీ కృష్ణుని ఆజ్ఞమేరకు కాళీయుడు తన కుటుంబ సమేతంగా యమునానదిని విడిచి వెళ్ళిపోయాడు దీంతో యమునానది జలం పూర్వంలా పవిత్రంగా మారింది, విషంతో నిండియున్న నీరంతా శ్రీకృష్ణుని పాద స్పర్స చేత మంచి నీరుగ మారింది.

ఇలా శ్రీ కృష్ణుడు కాళీయమర్దనం చేసాడు. తాను చేసిన పనికి బ్రహ్మ సిగ్గు పడేలా శ్రీకృష్ణుడు ఏం చేసాడో తరువాయి భాగం లో చెప్పుకుందాం.

Krishna Story part – 1

Leave a Reply