Lord Krishna Stories – Govardhan Parvat Story – Lord Krishna Lifts Govardhana Hill

గోవర్ధనపర్వతం గొడుగుగా మారిన క్షణం :

బృందావనం లో ఉన్న గోవులన్నిటికి అవసరమైన మేతకు ప్రధాన ఆధారం గోవర్ధనపర్వతం. యాదవులందరు దేవేంద్రుడిని  తమ గోవుల్ని మేపే గోవర్ధనపర్వతం పైన వర్షా లు కురిపించి పంటలు పండించమని కోరుతూ ప్రతి సంవత్సరం ఇంద్రయాగం చేసేవారు కాని ఒకనాడు శ్రీ కృష్ణుడు ఈ యాగ నిర్వాహణను అడ్డుకొని “ నిజానికి మనం పూజించాల్సింది ఇంద్రుడిని కాదు మనకు ఎంతగానో సహాయపడే ఈ గోవర్ధనపర్వతానికి పూజలు చేయాలి” అని అంటారు. శ్రీకృష్ణుని మాటలు విన్న అందరు “కృష్ణుడు చెప్పింది నిజమే మనకు ఎల్లప్పుడు తోడుగా వున్నది ఈ గోవర్ధన పర్వతం కనుక మనం కృష్ణుడు చెప్పినట్టు పూజలు చేయాల్సింది ఈ గోవర్ధన పర్వతానికే” అని అంటూ ఇంద్రయాగం బదులు గోవర్ధన పూజ చేయటం ప్రారంభిస్తారు బృందావనవాసులు. ఈ విషయన్ని గమనించిన ఇంద్రుదేవుడు ఆగ్రహంతో ఊగిపోయాడు…. యాదవులను ఎలాగైనా కటినంగా శిక్షించి వారిచేత మల్లి తనను పూజింపబడెల చేయాలనీ  అనుకుంటాడు. బృందావనం లో ధారపాతమైన వర్షాన్ని ఎడతెరిపి లేకుండా కురిపించసాగాడు. ఉరుములు మెరుపులు పిడుగులతో గాలివాన బీవత్సం చేసింది. దీంతో భయ భ్రాంతులైన యాదవులను చూసి  శ్రీకృష్ణుడు స్వయంగ తానే దేవేంద్రుడికి బుద్ధి చెప్పాలనె నెపం తో గోవర్ధనగిరిని తన చిటికిన వ్రేలిపై ధరించి అందరిని ఆ కొండ గొడుగు లోనికి రమ్మని ఆహ్వానించాడు. గోగోపకులందరూ పసివారినుంచి వృద్ధుల వరకు గోసందోహాలతో ఆ కొండనీడలో చేరారు. అది ఒక అద్భుత దృశ్యం. అయితే ఆ సమయంలో అక్కడ కొందరు ప్రౌఢవృద్ధులు ఎందుకైనా మంచిదని తమ తమ కఱ్ఱలు పోటీపెట్టి నిలిచారట! రక్షించేది ఆ గోవర్ధనగిరిధారి శ్రీకృష్ణుడు గదా! నిజంగా ఆ కొండే కూలిపోతే పోటీ పెట్టిన కఱ్ఱలు ఆపగలవా?

ఈ విధంగ శ్రీ కృష్ణుడు ఆ పర్వతాన్ని 7 రోజులవరకు మోస్తూ అక్కడివారందరికీ రక్షణ కల్పించాడట. ఇక శ్రీ కృష్ణుడు గోపికావస్త్రాపహరణం చేసిన దాని గురించి తరువాయి భాగం లో చెప్పుకుందాం.

Krishna Story part – 1

 

Leave a Reply