Interesting Facts in Telugu Language

Amazing Facts in Telugu

 

 • మన పాలపుంతలోని నక్షత్రాలను సెకనుకొకటి చొప్పున లెక్క పెట్టడం మొదలుపెడితే పూర్తయ్యేసరికి దాదాపు మూడువేల సంవత్సరాలు పడుతుంది.
 • పైజమాపదం పర్షియన్ బాష నుంచి వచ్చింది, పా అంటే కాలు , జామా అంటే వస్త్రం.
 • ఫిలిప్పీన్స్ లోని ఓ మ్యూజియంలో ఉన్న ‘పెరల్ అఫ్ అల్లా’ సహజ ముత్యాలలో ప్రపంచంలోనే పెద్దది. దీని బరువు 4 కిలోలు.
 • ప్రపంచంలో అత్యధిక వేగంతో గాలులు వీచే ప్రదేశం అంటార్కిటికాలోని కామన్వెల్త్ బే. అక్కడి గాలి గంటకు 150 మైళ్ళ వేగంతో వీస్తుంది.
 • మరణించేనాటికి భారత రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ ఖాతాలో ఉన్న సొమ్ము రూ.1432. ఆయన మీద గౌరవంతో పంజాబ్ నేషనల్ బ్యాంకు వారు ఇప్పటికి ఆ ఖాతాను ముసివేయలేదు.
 • మెక్సికో నగరం ఏటా 18అంగుళాలు కుంగుతోంది.
 • పుట్టినప్పుడు పిల్లిపిల్లలకు కనిపించదు, వినిపించదు. తల్లి గొంతు నుంచి వచ్చే ప్రకంపనలే వాటికి భౌతిక సంకేతాలుగా పనిచేసి , స్పందిస్తాయి.
 • ఆఫ్రికా రకం లంగ్ఫిష్ నీళ్ళు లేకుండా నాలుగేళ్ళు జీవించగలదు. అనావృస్టి ఏర్పడితే అది ఓ గొయ్యి తవ్వుకొని, బురదతో తన చుట్టూ ఓ కర్పరం ఏర్పరుచుకుని, కొద్దిగా శ్వాసించే మార్గం ఉంచుకుని మిగిలినదాన్ని మూసేసుకుంటుంది. క్రమంగా అది గట్టిపడిపోతుంది. వర్షం వచ్చినప్పుడు అది కరుగుతుంది, చేప నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది.
 • స్త్రాబెరీలలోకన్నా నిమ్మకాయల్లో చెక్కర శాతం ఎక్కువ.
 • రాత్రిపూట వచ్చే ఇంద్రధనుస్సును మూన్ బో లేదా లూనార్ రెయిన్బో అంటారు. చంద్రుడి నుంచి వచ్చే తక్కువ కాంతివల్ల ప్రత్యేక కెమెరాల్లో తప్ప సాధారణ కంటికి ఇవి పూర్తి స్థాయిలో కనిపించవు.
 • చంద్రుడి మీద దిగినపుడు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ముందు ఎడమకాలు పెట్టాడు.
 • ఒకటి పక్కన వంద సున్నాలు పెడితే వచ్చే సంక్య గుగోల్ (googol). దీని ఆధారంగానే ప్రముఖ సెర్చిoజన్ ‘గూగుల్’ (google) కు పేరు పెట్టారు.
 • సగటు మనిషి తల మీద వెంట్రుకలు పెరుగుతాయి. రోజుకి వెంట్రుకలు ఊడిపోతాయి. ఊడిపోకుండా ఉంది, కత్తిరించకుండా వదిలేస్తే ఒక్కో వెంట్రుక 14 మీటర్ల పొడవు పెరగగలదు
 • సెకనులో వందో వంతు కాలాన్ని జిప్ఫి అంటారు.
 • గడియారాలు ప్రకటనల్లో సమయాన్ని ఎక్కువగా 10:10గా సూచిస్తుంటారు. ఆ కోణాల్లో ముళ్ళు ఉన్నప్పుడు ఏర్పడే చిత్రం కొంచెం నవ్వినట్టుగా కనబడుతుంది. అంతకంటే ముక్యంగా ఓ ‘సిమ్మెట్రీ’ ఉండి, అందంగా కనబడుతుంది. అందుకే ప్రకటనదారులు ఆ సమయానికి వాచీని సెట్ చేస్తారు.
 • తొలిసారిగా గులాభి అత్తరును తయారుచేయించి ఉపయోగించినది….. మొఘల్ రాణి నూర్జహాన్
 • ఉత్తమ విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్ కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం ‘మదరిండియా’ (1957), రెండోది ‘సలామ్ బాంబే’ (1988)
 • 1964లో ర్యండీ ‘గార్డ్ నర్’ అనే వ్యక్తి 264 గంటల 12 నిమిషాలు మేలుకొని ఉంది రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత అతడు పది హేను గంటలు నిద్రపోయాడు.
 • ‘మిక్కిమౌస్’ కు వాల్ట్ డిస్నీ పెట్టిన పేరు ‘మార్టిమార్’. కానీ అదంత బావుండలేదని వాల్ట్ డిస్నీ భార్య లిల్లియన్ డిస్నీ దాన్ని ‘మిక్కి మౌస్’ గా మార్చేసింది.
 • ఒక తేనెపట్టులో ఎనభైవేల తేనెటీగలు ఉండగలవు.
 • ఈఫిల్ టవర్ పైకొనకు ఎక్కడానికి 1665 మెట్లున్నాయి.

Leave a Reply