Chudavayya Nisudati Vilasamu Annamayya keerthanalu

Chudavayya Nisudati Vilasamu Annamayya keerthanalu:

Pa||

Chudavayya Nisudati Vilasamu

Vedukakadavu Vibudavu Nivu ||

Ca||

Punnamivennela Pogulu Vosi

Sannapu Navvula Javaralu |

Vannela Kumkuma Vasamta Made

Innita Kalalato I Merugubodi ||

Ca||

Patimci Tummeda Paujulu Dirci

Katuka Kannula Kaliki Yide |

Suti Jakkavala Jodalarimci

Natakapu Gatula Nabi Sarasi ||

Ca||

Amgajurathamuna Hamsalu Nilipi

Kamguleni Gana Gajagamana |

Imgitapu Srivemkatesa Ninnenase

Pamgena Suratapu Pallavadhari ||

Lyrics In Telugu:

ప||

చూడవయ్య నీసుదతి విలాసము |

వేడుకకాడవు విభుడవు నీవు ||

చ||

పున్నమివెన్నెల పోగులు వోసి

సన్నపు నవ్వుల జవరాలు |

వన్నెల కుంకుమ వసంత మాడే

ఇన్నిటా కళలతో ఈ మెరుగుబోడి ||

చ||

పాటించి తుమ్మెద పౌజులు దీర్చీ

కాటుక కన్నుల కలికి యిదే |

సూటి జక్కవల జోడలరించీ

నాటకపు గతుల నాభి సరసి ||

చ||

అంగజురథమున హంసలు నిలిపి

కంగులేని ఘన గజగమన |

ఇంగితపు శ్రీవేంకటేశ నిన్నెనసె

పంగెన సురతపు పల్లవాధరి ||

Leave a Reply