Chala Novviseyunatti Annamayya keerthanalu

Chala Novviseyunatti Annamayya keerthanalu :

Pa||

Chala Novviseyunatti Janmamemi Maranamemi |

Malugalasi Doratanambu Manputimta Calada ||

Ca||

Pudami Bapakarmamemi Punyakarmamemi Tanaku

Kadaparanibamdhamulaku Garanambulainavi |

Yedapakunna Pasidisamkelemi Yinupasamkelemi

Medaku Dagiliyumdi Yepudu Miducudaranivi ||

Ca||

Calamukonna Apademi Sampademi Yepudu Danaku

Alamipatti Duhkamulaku Nappagimcinattidi |

Yelami Basidigudiyayemi Yinupagudiyayemi Tanaku

Muluga Muluga Dolitoli Modutimta Calada ||

Ca||

Karmiyanayemi Vikrutakarmiyainanemi Danaku

Karmapalamumidakamksha Galugutimta Calada |

Marmamerigi Vemkatesumahimalanucu Delisinatti-

Nirmalatmu Kihamu Baramu Nedu Galige Jalada ||

Lyrics In Telugu:

ప||

చాల నొవ్విసేయునట్టి జన్మమేమి మరణమేమి |

మాలుగలసి దొరతనంబు మాన్పుటింత చాలదా ||

చ||

పుడమి బాపకర్మమేమి పుణ్యకర్మమేమి తనకు

కడపరానిబంధములకు గారణంబులైనవి |

యెడపకున్న పసిడిసంకెలేమి యినుపసంకెలేమి

మెడకు దగిలియుండి యెపుడు మీదుచూడరానివి ||

చ||

చలముకొన్న ఆపదేమి సంపదేమి యెపుడు దనకు

అలమిపట్టి దుఃఖములకు నప్పగించినట్టిది |

యెలమి బసిడిగుదియయేమి యినుపగుదియయేమి తనకు

ములుగ ములుగ దొలితొలి మోదుటింత చాలదా ||

చ||

కర్మియనయేమి వికృతకర్మియైననేమి దనకు

కర్మఫలముమీదకాంక్ష గలుగుటింత చాలదా |

మర్మమెరిగి వేంకటేశుమహిమలనుచు దెలిసినట్టి-

నిర్మలాత్ము కిహము బరము నేడు గలిగె జాలదా ||

Leave a Reply