Why Do We Celebrate Diwali in Telugu

Diwali festival story in telugu

భారత దేశ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను మరచి అందరు కలసి ఐక్యమత్యంతో జరుపుకునే పండుగ  దివ్య దీప్తుల దీపావళి. నరకాసురుడి సంహారం జరిగిన మరుసటి రోజు అతడి పీడ వదిలిందన్న ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. అదేకాకుండా లంకలోని రావణుడిని సంహరించి శ్రీ రాముడు సతీసమేతంగా తన రాజ్యమైన అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళి పండుగను జరుపుకున్నారని రామాయణం లొ చెప్పపడింది.

Story Behind Diwali Festival

చీకటిని తోలుతూ వెలుగు తెచ్చే పండుగ ఈ దీపావళి, విజయానికి ప్రతికగాకుడా ఈ పండగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన దుస్తుల రెపరెపలు, కమ్మటి పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటాము. దీపావళికి ముందు రోజు అనగా ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు నరక చతుర్దశి జరుపుకుంటారు.

దీపాలంకరణ మరియు శ్రీ లక్ష్మీ అమ్మవారి  పూజ

diwali festival story in telugu

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||

భావం : ‘దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు అంతేకాక మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా కూడా భావిస్తారని అర్ధం’
మహిళలందరూ ఆశ్వయుజ బహుళ చతుర్ధశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో దీపాలను వెలిగిస్తారు. కార్తిక పౌర్ణమినాడు సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో ఈ దీపాలను వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి మరియు సౌజన్యానికి ప్రతీకలుగా అందరు భావిస్తారు. దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి పూజను జరుపుకోవటానికి ఓ విశిష్టత ఉంది. ఒకనాడు దుర్వాస మహర్షి ఇంద్రుడి ఆతిథ్యానికి సంతోషించి ఆయనకి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. అప్పుడు ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్నఐరావతపు మెడలో వేస్తాడు కానీ ఐరావతం ఆ హారాన్ని కలిక్రింద వేసి తోక్కుతుంది, అది చుసిన దుర్వాసమహర్షి  ఆగ్రహము చెంది ఇంద్రుడిని శపిస్తాడు. దాని ఫలితంగా దేవేంద్రుడు తన రాజ్యంతోపాటు సర్వసంపదలను పోగొట్టుకుంటాడు. దిక్కుతోచని స్థితిలో శ్రీహరిని ప్రార్ధించగా ఆ శ్రీహరి ఇంద్రుని పరిస్థితిని చూసి ఇలా అంటాడు ‘ఇంద్రదేవ ఒక దీపాన్ని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా భావించి  పూజించు’ అని సూచించాడు.అతని పూజకు  తృప్తిచెంది లక్ష్మీదేవి ఇంద్రునికి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను అనుగ్రహించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

ఆ సమయంలో ఇంద్రుడు మహాలక్ష్మీని ఇలా ప్రశ్నించాడు. అమ్మ నీవు కేవలం మహావిష్ణువుని వద్దనే ఉండటం న్యాయమా తల్లి ? నీ భక్తులను కరుణించవా ? అని అంటాడు దానికి ఆ మహాలక్ష్మి ఇంద్రునితో ఇలా అంటుంది ‘దేవేంద్ర నన్ను త్రికరనసుధితో ఆరాదించే వాళ్ళకి వారి వారి ఇస్టానుగునంగా మహర్షులకు మోక్షలక్ష్మీరూపంలో , విజయాన్ని కోరుకునేవారికి  విజయలక్ష్మీరూపంలో , విద్యార్థులకు విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరేవారికి ధనలక్ష్మీగాను , వారందరి కోరికలు నెరవేర్చే వరలక్ష్మిగాను  ప్రసన్నురాలౌతాను’ అని సమాదానం ఇచ్చింది అందుకే దీపావళి రోజు ఆ మహాలక్ష్మిని  పూజించేవారికి సర్వసంపదలు కలుగుతాయని అందరు నమ్ముతారు

నరక చతుర్దశి

The Lord Krishna Connection

ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్ధశిగా ప్రసిద్ధిగాంచింది .నరకాసురుడనే రాక్షసుడు ప్రజలను పీడిస్తూ దేవ లోకం మరియు మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. కృతయుగంలో హిరణ్యాక్షుని సంహరించిన వరాహస్వామికి మరియు భూదేవికి అసుర సంధ్యా సమయంలో నరకుడుజన్మిస్తాడు. నరకాసురుడు  తన తల్లి చేతిలోనే మరణించాలనే వరం పొందుతుంది భూదేవి. ద్వాపరయుగంలో మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది.

నరకాసురుడు లోక కంటకుడై అధర్మాలు చేస్తుండగా అతని అధర్మాలను అరికట్టడానికి శ్రీ కృష్ణుడు సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు వారి మద్య భీకరయుద్ధం  జరుగుతుంది. భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకాసురుడు. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ శ్రీ కృష్ణుడిని ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీ కృష్ణుడు. నరకాసురుడు అంతమైన సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలందరూ సంబరాలు జరుపుకున్నారు . ఆ  సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య అవ్వడంతో , చీకటిని పారద్రోలుతూ ప్రజలందరూ దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చుతూ  వేడుకలు జరుపుకునారు. అదే కాలక్రమంలో దీపావళి పర్వదినంగా మారింది.

సత్యం-శివం-సుందరం

పంచభూతాలు అనగా నింగి, నేల, నీరు, నిప్పు మరియు గాలి,అందులో  ప్రధానమైనది నిప్పు. ఈ నిప్పు ప్రాణికోటి మనుగడకు ఉపకరించే తేజస్సును, ఆహారాన్ని ఐహికంగాను, విజ్ఞాన ధర్మగరిమను ఆధ్యాత్మికంగాను ప్రసాదిస్తుంది ఈ దీపాలను వెలిగించటంద్వారా మూడు రంగులు ప్రధానంగా మనకు గోచరమవుతాయి అవి నీలము, పసుపు, తెలుపు ముక్యమైన సత్త్వరజస్తమోగుణాల సమ్మేళనంగా ఆర్యులు చెబుతారు ఈ ముడురంగులను లక్ష్మి, సరస్వతి మరియు దుర్గ మాతలుగా పౌరాణికులు భావిస్తారు, లక్ష్మి, సరస్వతి మరియు దుర్గ మాతలను ఆరాధించటం, మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతమని సందేశాత్మకంగా గై కొంటారు భారతీయులు.

పుణ్యకాలంలో జ్యోతిని దానం చేయుట ఉత్తమమైన కార్యంగా హైందవులు భావిస్తారు ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్యలు ఎంతో పవిత్ర పర్వదినంగా భావిస్తారు. ఆనందోత్సాహాలతో దేశమంతటా అందరూ కలసి మెలిసి జరుపుకునే పండుగ రోజులివి.

సాయంత్ర సమయంలో దీపాలు వెలిగించి, ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపాల వెలుగు పితృదేవతలకు దారి చూపుతాయని శాస్త్రాల చెప్తునాయి. దీపాలని వెలిగించిన తర్వాత  కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి వెల్లి తీపి పదార్థం తింటారు. ఆ తరువాత పూజగదిలో నువ్వుల నూనె తో దీపం  వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించుకొని కలశంపై ఆ మహాలక్ష్మీని అవాహన చేసి విధివిధానంగా పూజిస్తారు పూజైన తర్వాత అందరు కలిసి ఆనందంతో బాణాసంచ కాలుస్తారు . పరిసరాలన్నీ చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు,  కాకరపువ్వొత్తులు, కళ్ళు మిరుమిట్లుగొలుపుతుంటే మరో ప్రక్క సీమటపాకాయల ఢమఢమ ధ్వనులతో మ్రోగుతుంటాయి. ఆ దీపాల వెలుగులవల్ల , టపాకాయల శబ్దతరంగాలవల్ల  దారిద్ర్యం దూరమవుతాది దుఃఖాలు దూరంగా తరిమివేయబడుతాయని  అంటారు అంతేకాక లక్ష్మీకటాక్షం కూడా  సిద్దిస్తుందని పురాణాలలో చెప్పబడింది. అంతేకాకుండ వర్షాకాలం వల్ల  ఏర్పడిన తేమవల్ల పుట్టుకువచ్చే క్రిమి కీటకాలు ఈ బాణాసంచా పొగలకి నశిస్తాయి. అమావాస్యనాడు  జరుపుకునే ఈ దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం వల్ల సర్వశుభాలు చేకూరుతాయని నమ్ముతారు.

Leave a Reply