Birth Of Yogamaya – Yogamaya Story – యోగమాయ జననం

The Birth Of Yogamaya:

యోగమాయ జననం:

శ్రీ కృష్ణుడు జన్మించిన సమయంలోనే గోకులంలో యశోదాదేవికి యోగమాయ ఉద్భవించింది. వసుదేవుడు ఆ అర్ధరాత్రి దేవకీ పురిటి పోతిళ్ళలో నున్న శిశువు శ్రీ కృష్ణుని యశోదాగృహంలో ఆమెపక్కలో పరుండబెట్టాడు. ఆమె బిడ్డ యోగమాయను దేవకీ మంచానికి చేర్చాడు. ఈ సందర్భంలో కొన్ని అధ్భుతసన్నివేశాలు జరిగాయి. చెరసాల కావలి వారలకు మైకం కమ్మింది. వసుదేవునకు యమునానది పాయలిచ్చి దారి యిచ్చింది. కారాగృహం దగ్గర కావలి కాసే గాడిద అప్పుడు  ఓండ్రు పెట్టకుండ వసుదేవుడు ఆ గాడిద కాళ్ళకు మ్రొక్కాడట.

అనుకున్నదొకటి జరిగిందొకటి:

birth of yogamaya

తెల్లవారగానే కంసుడు కారాగారప్రాంగణంలో సాక్షాత్కరించాడు. అయితే చెల్లెలి పురిటిపోత్తిళ్ళలో ఉన్నది ఆడపిల్ల కాని కంసునకు భయకంపాలు పోలేదు. ఆ పసి పాప పై కంసమహారాజు కత్తి ఝులిపించాడు. దేవకీదేవి అన్న గారిని ప్రార్ధించింది. కాని కంసుడు ఆ పసిపాపను పైకెత్తి విసిరి కత్తికి బలి ఇవ్వాలని కాంక్షించాడు. ఆ పసిపాప నేలపై పడలేదు. ఆకాశంలో నిలిచి, “దుర్మార్గుడా! నిన్ను చంపేవాడు భూమిపైన వేరొకచోట చక్కగా పెరుగుతున్నాడు” అని అధిక్షేపించి పలికింది. ఆమె శంఖచక్రచర్మశరచాపశూలధారిణియై నవరత్న మణిహార భూషణయై అష్టభుజయై గంధర్వవియచ్చరులు చారణ గీతికలు ఆలపించగా భూమండలంలో పలుతావుల అవతరించింది. కంచికామాక్షి – విజయవాడ కనకదుర్గ – మధుర మీనాక్షి మున్నగు దేవతాస్వరూపాలు ఆమెవే…..

శ్రీ కృష్ణుని నామకరణ విశేషాలను తరువాయి భాగంలో చెప్పుకుందాం…..

Krishna Story part – 1

 

One Response

Leave a Reply