Birth Of Sri Krishna Story – Sri Krishna Jananam

The Birth Of Lord Krishna:

శ్రీ కృష్ణుని జననం:

శ్రీ కృష్ణుడు ద్వాపరయుగంలో శ్రీ ముఖసంవత్సరం శ్రావణ బహుళ అష్టమినాడు రాత్రి వృషభలగ్నంలో అభిజిన్ముహుర్తంలో రోహిణినక్షత్రంలో జన్మించినట్లు పురాణ కథనం. కలియుగారంభానికి 125 సంవత్సరాలు 7 నెలల 8 రోజులు పూర్వం; అంటే క్రిస్తుషకపూర్వం 3225 సంవత్సరంలో శ్రీ కృష్ణుని జననం. శ్రీ కృష్ణుడు జన్మించింది మధురానగరంలో; కంసమహారాజు ఏర్పరచిన కారాగారంలో. అందుచేతనే చెఱ సాలకు శ్రీకృష్ణజన్మస్థానం అనే గౌరవబిరుదు ఏర్పడింది.

story of krishna birth

శ్రీ కృష్ణుని తల్లి దేవకీదేవి, తండ్రి వసుదేవుడు. కంసుడు దేవకీదేవి అన్నగారు. ఆడపడుచు దేవకీదేవి పై మొదట కంసునకు అనురాగం ఎక్కువగానే ఉంది. అతడు చెల్లెలిని సగౌరవంగా చీరసారెలతో అత్తవారింటికి తానే సారథ్యం వహించి రథం తోలుకొని పంపుతుండగా ఆకాశవాణి పలికింది; ఆమె అష్టమ గర్భంలో పుట్టేవాడు కంసుని సంహరిస్తాడని. కంసునకు మతిపోయింది. అతడు చెల్లెలు దేవకీ దేవిని చంపివేయటానికి కత్తిదూశాడు. అప్పుడు దేవకి భర్త వసుదేవుడు తన వాక్చాతుర్యంతో కంసునికోపాని ఉపశమింపచేశాడు.

కంసుడు తన కోపాగ్నిని ఉపశమింప చేసుకున్నాడు కాని అది కొంతకాలానికి తిరిగి ప్రజ్వరిల్లింది. దేవకికి పుట్టిన బిడ్డలు ఆర్గురిని కంసుడు సంహరించాడు. ఏడవసంతానం గర్భసంరక్షణయోగంచేత దేవకినుంచి రోహిణీ గర్భానికి చేరింది. ఆ బిడ్డే బలరాముడు. ఇక అష్టమగర్భధారణ కాగానే కంసుడు భయభ్రాంతుడై దేవకీ వసుదేవులను కారాగృహంలో బంధించాడు.

ఇది శ్రీకృష్ణుడు పుట్టడానికి ముందు జరిగిన కథ. శ్రీ కృష్ణుడి అవతారసమయంలో జరిగిన అధ్బుతాలను తరువాయి భాగంలో చెప్పుకుందాం…..

Leave a Reply