Bhaavinchi telusukonte Annamaya Keerthana Lyrics

Bhaavinchi telusukonte bhaagyaphalamu
aavaleevali phalamu lamgajajanakudae

Daanamulalo phalamu tapamulalo phalamu
mosamulalo phalamu mukumdudae
jnaanamulalo phalamu japamulalo phalamu
naanaa phalamulu naaraayanudae

Vinutulalo phalamu vaedamulalo phalamu
manasuloni phalamu maadhavudae
dinamulalo phalamu teerthayaatrala phalamu
ghanapunyamula phalamu karunaakarudae

Satatayoga phalamu chaduvulalo phalamu
atisayonnata phalamu yachyutudae
yatulaloni phalamu jitakaamita phalamu
kshiti mokshamu phalamu sreevaemkataesudae

Lyrics In Telugu:

భావించి తెలుసుకొంటే భాగ్యఫలము ఆవలీవలి ఫలము లంగజ జనకుడె ||

దానములలో ఫలము, తపములలో ఫలము మోసములలో ఫలము ముకుందుడె
జ్ఞానములలో ఫలము జపములలో ఫలము నానా ఫలములును నారాయణుడె ||

విమతులలో ఫలము వేదములలో ఫలము మనసులోని ఫలము మాధవుడె
దినములలో ఫలము తీర్థ యాత్రల ఫలము ఘనపుణ్య ఫలము కరుణాకరుడె ||

సతత యోగఫలము చదువులలో ఫలము అతిశయోన్నత ఫలము యచ్యుతుడె
యతులలోని ఫలము జితకామిత ఫలము క్షితి మోక్షము ఫలము శ్రీవేంకటేశుడె ||

Leave a Reply