Alukalu Chellavu Hari Annamayya keerthana Lyrics

Alukalu Chellavu Hari Purushottama

Nali Nimdira Nito Navvinadi

Adilakshmi Mohana Kamalambuna

Veda Mata Ninnu Vesinadi

Adesa Nipai Nabayahastamunu

Sadaramuga Gadu Juchinadi

Siri Dana Kannula Cimtamanulanu

Pori Nipai Diga Bosinadi

Varada Hastamuna Valaceyi Pattuka

Aruduga Ninu Matadimchinadi

Jaladhi Kanya Tana Sarvamgambula

Bilichi Ninnu Nitu Penaginadi

Alamuka Sri Vemkatadhipa Ninu Rati- Nelami Ni Vurambekkinadi

Lyrics In Telugu:

అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ

నలి నిందిర నీతో నవ్వినది ||పల్లవి||

ఆదిలక్ష్మి మోహన కమలంబున

వేద మాత నిను వేసినది

ఆదెస నీపై నభయహస్తమును

సాదరముగ గడు సాచినది ||అలుకలు||

సిరి దన కన్నుల చింతామణులను

పొరి నీపై దిగ బోసినది

వరద హస్తమున వలచెయి బట్టుక

అరుదుగ నిను మాటాడించినది ||అలుకలు||

జలధి కన్య తన సర్వాంగంబుల

బిలిచి నిన్ను నిటు పెనగినది

అలముక శ్రీ వేంకటాధిప నిను రతి

నెలమి నీ వురంబెక్కినది ||అలుకలు||

Leave a Reply