Adigaka Nijamatambadi Annamayya keerthana Lyrics

adigaka nijamatambadi gaka yajakam

badigaka hrudayasuka madigaka paramu

amalamagu vijanamanu mahadhvaramunaku

namarinadi samkalpamanu mahapasuvu

pramadamanu yupagambamuna vikasimpimci

vimalemdriyahutulu velpamgavalada ||adigaka||

araya nirmamakara macaryudai celaga

varusato dharmadevata brahma gaga

dorakonna samadamadulu danadharma

basvaragunadulu viprasamiti gavalada ||adigaka||

tiruvemkatacaladhipu nijadhyanambu

narulakunu somapanambu gavalada

paraga natanikrupa paripurnajaladhilo

narhulai yapabrutham badamgavalada ||adigaka||

Lyrics In Telugu:

అదిగాక నిజమతంబది గాక యాజకం

బదిగాక హృదయసుఖ మదిగాక పరము ||పల్లవి||

అమలమగు విజ్ఞానమను మహాధ్వరమునకు

నమరినది సంకల్పమను మహాపశువు

ప్రమదమను యూపగంబమున వికసింపించి

విమలేంద్రియాహుతులు వేల్పంగవలదా ||అదిగాక||

అరయ నిర్మమకార మాచార్యుడై చెలగ

వరుసతో ధర్మదేవత బ్రహ్మ గాగ

దొరకొన్న శమదమాదులు దానధర్మ

భాస్వరగుణాదులు విప్రసమితి గావలదా ||అదిగాక||

తిరువేంకటాచలాధిపు నిజధ్యానంబు

నరులకును సోమపానంబు గావలదా

పరగ నాతనికృపా పరిపూర్ణజలధిలో నర్హులై యపబృథం బాడంగవలదా ||అదిగాక||

Leave a Reply