Adi Nayaparadha Annamayya keerthana Lyrics

Adi Nayaparadha Midi Nayaparadha

Madiyu Nidiyu Nayaparadhamu

Neraya Rupamulella Nirupameka

Narayaniyadi Nayaparadhamu

Paripurnudaguninnu Bariccinnuniga

Narayuta Yadi Nayaparadhamu

Jivatmuniga Jimtimpa Dalacuta

Yavamka Nadi Nayaparadhamu

Sevimci Ninu Natma Jimtimpakumduta

Avala Nidi Nayaparadhamu

Ideragaka Vemkatesuda Ninu Goni

Yaduta Yadi Nayaparadhamu

Yeda Jucina Nayedura Numdaga Ninnu

Nadanida Vedakutaparadhamu

Lyrics In Telugu:

అది నాయపరాధ మిది నాయపరాధ

మదియు నిదియు నాయపరాధము ||పల్లవి||

నెరయ రూపములెల్ల నీరూపమేకా

నరయనియది నాయపరాధము

పరిపూర్ణుడగునిన్ను బరిచ్ఛిన్నునిగా

నరయుట యది నాయపరాధము ||నెరయ||

జీవాత్మునిగా జింతింప దలచుట

యావంక నది నాయపరాధము

సేవించి నిను నాత్మ జింతింపకుండుట

ఆవల నిది నాయపరాధము ||నెరయ||

ఈడెరగక వేంకటేశుడ నిను గొని

యాడుట యది నాయపరాధము

యేడ జూచిన నాయెదుర నుండగ నిన్ను

నాడనీడ వెదకుటపరాధము ||నెరయ||

Leave a Reply