Adi Brahmandambidi Annamayya keerthana Lyrics

Adi Brahmandambidi Pindandambu

Dutu Jivulamu Vunnaramidivo

Udayasta Mayamu Lonarina Valene

Niduralu Melkanu Nimayamulu

Kadisi Tirisamdhya Kalambulavale

Gudigonu Dehiki Gunatrayamulu

Pudami Sasyamulu Podalina Valene

Vodali Rogamulannavive

Udugani Velupati Vudyogamuvale

Kodisagedi Miti Korikalu

Velupalagala Sri Vemkata Vibude

Kaladatumalo Ganuditade

Calamuna Nitani Saranagatiye

Phalamunu Bhagyamu Bahu Sampadalu

Lyrics In Telugu:

అది బ్రహ్మాణ్డంబిది పిణ్డాణ్డంబు

దుటు జీవులము వున్నారమిదివో ||పల్లవి||

ఉదయాస్త మయము లొనరిన వలెనే

నిదురలు మేల్కను నిమయములు

కదిసి తిరిసంధ్యా కాలంబులవలె

గుదిగొను దేహికి గుణత్రయములు ||అది బ్రహ్మాణ్డంబిది||

పుడమి సస్యములు పొదలిన వలెనే

వొడలి రోగములన్నవివే

ఉడుగని వెలుపటి వుద్యోగమువలె

కొడిసాగెడి మితి కోరికలు ||అది బ్రహ్మాణ్డంబిది||

వెలుపలగల శ్రీ వేంకట విభుడే

కలడాతుమలో ఘనుడితడే

చలమున నీతని శరణాగతియే

ఫలమును భాగ్యము బహు సంపదలు ||అది బ్రహ్మాణ్డంబిది||

Leave a Reply