Dasara Navaratri Puja Vidhanam In Telugu 2018

Dasara Navaratri puja Vidhanam in Telugu

 

 

  • మొదటి రోజు (10/Oct/ 2018) శ్రీ శైలపుత్రీ దేవి (శ్రీస్వర్ణకవచాలంకృత దుర్గా దేవి) ఈ అమ్మవారికి బంగారు రంగు చీర లేదా బంగారు రంగు దుస్తులు ధరింప చేయాలి. గ్రంథాల ప్రకారం, ఆమె రెండు చేతులలో త్రిశూలం మరియు కమలం ను కలిగి ఉంటుంది. ప్రసాదంగ చలివీడీ, వడపప్పు మరియు పాయసం పెట్టాలి.

 

  • రెండవ రోజు (11/Oct/ 2018) శ్రీ బ్రహ్మచారిణి దేవి (బాలత్రిపురసుందరి దేవి) ఈ అమ్మవారికి లేత గులాబీ రంగు చీర లేదా గులాబీ రంగు దుస్తులు ధరింప చేయాలి. ప్రసాదంగ తీపి బూందీ మరియు సెనగలు పెట్టాలి·

 

  • మూడవ రోజు (12/Oct/ 2018) శ్రీ చంద్రఘంట దేవి (గాయత్రి దేవి) ఈ అమ్మవారికి నారింజ రంగు చీర లేదా దుస్తులు ధరింప చేయాలి. ఆమె బంగారు ఛాయతో మరియు నుదిటిపై చంద్రుడిని ధరించింది, అందుకే ఆమెని భక్తులు చంద్రఘంట అని పిలుస్తారు. ప్రసాదంగ రవ్వ కేసరి మరియు పులిహోర పెట్టాలి.

 

  • నాలుగవ రోజు (13/Oct/ 2018) శ్రీ కుశుమందిని దేవి (అన్నపూర్ణ దేవి) ఈ అమ్మవారికి గంధపు పసుపు రంగు చీర లేదా దుస్తులు ధరింప చేయాలి. ప్రసాదంగ పొంగల్ పెట్టాలి.

 

  • ఐదవ రోజు (14/Oct/ 2018) శ్రీ స్కండ్మాత దేవి (లలిత దేవి) ఈ అమ్మవారికి స్వచ్ఛమైన బంగారం రంగు చీర లేదా దుస్తులు ధరింప చేయాలి. ప్రసాదంగ పులియోరా మరియు వడ పెట్టాలి.

 

  • ఆరవ రోజు (15/Oct/ 2018) శ్రీ కాత్యాయనీ దేవి (మహాలక్ష్మి దేవి) ఈ అమ్మవారికి గులాబీ రంగు చీర లేదా దుస్తులు ధరింప చేయాలి. ప్రసాదంగ బెల్లమన్నం పెట్టాలి.

 

  • ఏడవ రోజు (16/Oct/ 2018) శ్రీ కాళరాత్రి దేవి (సరస్వతి దేవి) ఈ అమ్మవారికి తెల్ల రంగు చీర లేదా దుస్తులు ధరింప చేయాలి. ప్రసాదంగ అటుకులు బెల్లం, సెనగపప్పు మరియు కొబ్బరి పెట్టాలి.

 

  • ఎనిమిదో రోజు (17/Oct/ 2018) శ్రీ మహాగౌరి దేవి (దుర్గా దేవి) ఈ అమ్మవారికి ముదురు ఎరుపు రంగు చీర లేదా దుస్తులు ధరింప చేయాలి. ప్రసాదంగ గారేరు (వడ) పెట్టాలి.

 

  • తొమ్మిదవ రోజు (18/Oct/ 2018) శ్రీ సిద్ధిదాత్రి దేవి (మహిషాసురమర్ధిని దేవి) ఈ అమ్మవారికి గోధుమ ఎరుపు కలయిక గల చీర లేదా దుస్తులు ధరింప చేయాలి. ప్రసాదంగ చెక్కరపొంగళి పెట్టాలి.

 

  • పదవ రోజు (19/Oct/ 2018) శ్రీ విజయ దుర్గాదేవి (శ్రీరాజరాజేశ్వరీ దేవి) ఈ అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీర లేదా దుస్తులు ధరింప చేయాలి. ప్రసాదంగ పులిహోర మరియు వడ పెట్టాలి

Leave a Reply